GVL Narasimha Rao: వైసీపీ అభ్యర్థి గురుమూర్తి హిందువా? కాదా?.. స్పష్టంగా చెప్పాలి: జీవీఎల్ నరసింహారావు డిమాండ్

YSRCP candidate Gurumurthy has give clarity on his religion says GVL Narasimha Rao

  • గురుమూర్తి చర్చికెళ్లి బిషప్ ఆశీర్వాదాన్ని తీసుకున్నారు
  • తిరుపతి నుంచి పోటీ చేసే అర్హత ఆయనకు లేదు
  • తిరుపతిలో అన్యమత ప్రచారం జరుగుతోంది

తిరుపతి ఉపఎన్నిక నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి మతంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బీజేపీ ఈ అంశాన్ని ప్రధాన అస్త్రంగా వాడుతోంది. తాజాగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ, గురుమూర్తి హిందువా? కాదా? స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.

 రాజ్యాంగంలోని షెడ్యూల్ కాస్ట్ 1950 ప్రకారం హిందూ, బౌద్ధ, సిక్కు మతాలను కాకుండా అన్యమత ధర్మాలను పాటించే షెడ్యూల్ కులాల వారిని ఎస్సీలుగా పరిగణించరని అన్నారు. గురుమూర్తి గూడూరులోని చర్చికి వెళ్లి బిషప్ ఆశీర్వాదాన్ని తీసుకున్నారని చెప్పారు. అందువల్ల రిజర్వుడు స్థానమైన తిరుపతి నుంచి పోటీ చేసే అర్హత గురుమూర్తికి లేదని అన్నారు.

గురుమూర్తి హిందూ ధర్మాన్ని పాటించరా? అని జీవీఎల్ ప్రశ్నించారు. ఒకవేళ హిందూ ధర్మాన్ని పాటిస్తే.. వారి నాయకుడికి నచ్చదనే ఉద్దేశంతో వేంకటేశ్వరస్వామిని దర్శించుకోలేదా? అని అడిగారు. గురుమూర్తి విషయాన్ని రాజ్యాంగ వ్యవస్థల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. దేవుడి పేరుతో కరపత్రాలను ముద్రించి వైసీపీ ప్రచారం చేస్తోందని... ముఖ్యమంత్రి జగన్ దీనికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుపతి ఎన్నికలను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని తెలిపారు. తిరుపతిలో అన్యమత ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోందని అన్నారు.

  • Loading...

More Telugu News