bandla ganesh: బండ్ల గణేశ్‌కు రెండోసారి సోకిన కరోనా!
![bandla ganesh teste positive for corona](https://imgd.ap7am.com/thumbnail/cr-tn-6076964220374.jpg)
- ఇటీవలే 'వకీల్ సాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్ల గణేశ్
- ఆ తర్వాతి రోజు నుంచే ఆయనలో లక్షణాలు
- జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స?
సినీ నిర్మాత బండ్ల గణేశ్ గతంలో కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆయనకు రెండోసారి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన 'వకీల్ సాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్ల గణేశ్ పాల్గొన్నారు. ఆ తర్వాతి రోజు నుంచే ఆయనలో లక్షణాలు కనపడడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు.
దీంతో ఆయనకు పాజిటివ్ నిర్ధారణ కావడంతో చికిత్స తీసుకుంటున్నారు. ఆయనకు ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స అందుతున్నట్లు సమాచారం. కాగా, ఇటీవల సినీ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిగత సిబ్బందిలో కొందరికి కూడా కరోనా సోకింది. దీంతో పవన్ కల్యాణ్ ముందస్తు జాగ్రత్తగా ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు.