USA: అమెరికాలో కన్న బిడ్డనే పెళ్లాడేందుకు కోర్టుకెక్కిన కన్న తండ్రి!
- బంధం బలంగా ఉంటే ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చని కామెంట్
- తన పేరును రహస్యంగా ఉంచాలని విజ్ఞప్తి
- ఇలాంటి పెళ్లిళ్లకు ఒప్పుకోని చట్టాలను రద్దు చేయాలంటూ డిమాండ్
కన్న బిడ్డనే పెళ్లి చేసుకోవాలనుకున్నాడో కన్న తండ్రి. అంతేకాదు.. కోర్టుకూ ఎక్కాడు. ఇలాంటి పెళ్లిళ్లను అనుమతించని చట్టాలను రద్దు చేయాలనీ డిమాండ్ చేశాడు. ఈ అనైతిక చర్యకు సంబంధించిన ఘటన అమెరికాలోని మాన్ హాటన్ లో జరిగింది. అయితే, తన కూతురిని పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ తండ్రి.. తన వివరాలేవీ బయటకు రాకుండా చూడాలంటూ కోర్టును కోరాడు.
ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం ఏదైనా సరే.. ఆ ఇద్దరి మధ్య మెరుగైన అవగాహన, దృఢమైన సంబంధం ఉండి పెళ్లి చేసుకుంటే భావప్రకటన, ప్రేమ, ఆధ్యాత్మికత చాలా గొప్ప స్థాయిలో ఉంటాయని చెప్పుకొచ్చాడు. సమాజంలోని చాలా మంది ఇలాంటి అనైతిక ఆచారాలకు ఒప్పుకోరని, అందుకే తన పేరును రహస్యంగా ఉంచాలని కోరుతున్నానని అతడు చెప్పాడు. అయితే, ఇలాంటి వాటిని కోర్టు ఎప్పటికీ ఒప్పుకోదని, ఆ తండ్రి కేసును గెలవలేడని లాయర్ ఎరిక్ రూబెల్ అన్నారు.