Kumarajan: కోలీవుడ్ హీరో కుమారజన్ ఆత్మహత్య!

Tamil Actor Kumarajan Sucide

  • సొంతంగా సినిమా తీసిన కుమారజన్
  • హిట్ కాకపోవడంతో నిరాశ
  • ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య

సొంతంగా ఓ సినిమాను నిర్మించి, దానిలో హీరోగా నటించిన ఓ తమిళ నటుడు, అందులో పేరు తెచ్చుకోలేక, ఇండస్ట్రీలో కోరుకున్న గుర్తింపు రాక, మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

  నమక్కల్ లోని తన ఇంట్లోనే నటుడు, నిర్మాత కుమారజన్ నిన్న మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో కుమారజన్ 'సొంతిప్పొమ్ సింతిప్పొమ్' పేరిట చిత్రాన్ని నిర్మించి, అదే సినిమాలో హీరోగానూ నటించారు. ఈ చిత్రం అంతగా హిట్ కాలేదు. దీంతో కొంతకాలంగా నిరాశలో కూరుకుపోయిన అతను, కెరీర్ సరిగ్గా సాగడంలేదని ప్రాణాలు తీసుకున్నట్టుగా సమాచారం.

 కాగా, అతను ఉరేసుకున్న గదిలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

Kumarajan
Collywood
Hero
Producer
Sucide
  • Loading...

More Telugu News