Hyderabad: హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ లో ట్రాఫిక్ జామ్‌

traffic jam at lb nagar

  • ఎన్టీఆర్ నగర్ కూరగాయల మార్కెట్ వ‌ద్ద‌ రైతుల ఆందోళ‌న‌
  • కొత్తపేటలోని పండ్ల మార్కెట్‎ కు వెళ్లే వాహనాలు ఎన్టీఆర్ నగర్ లోకి వ‌స్తున్నాయ‌ని నిర‌స‌న‌
  • ప్రతి రోజు కూరగాయలను విక్ర‌యించుకోలేక‌పోతున్నామ‌ని మండిపాటు
  • రోడ్డుపై కూర‌గాయ‌లు పార‌బోసిన వైనం

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‎ ప‌రిస‌ర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ నెల‌కొంది. అక్క‌డి ఎన్టీఆర్ నగర్ కూరగాయల మార్కెట్ వ‌ద్ద‌ రైతులు రోడ్డుపై కూరగాయలు పారబోసి ఆందోళనకు దిగడంతో ఈ ప‌రిస్థితి నెల‌కొంది. కొత్తపేటలోని పండ్ల మార్కెట్‎ కు వెళ్లే వాహనాలు ఎన్టీఆర్ నగర్ లోకి వ‌స్తుండ‌డంతో ప్ర‌తిరోజు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోందని, ఈ కార‌ణంగా తాము న‌ష్ట‌పోతున్నామ‌ని, ప్రతి రోజు కూరగాయలను విక్ర‌యించుకోలేక‌పోతున్నామ‌ని రైతులు అంటున్నారు. వారు ఆందోళ‌న‌కు దిగ‌డంతో రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం నెల‌కొంది. దీంతో అక్క‌డ‌కు చేరుకున్న పోలీసులు రైతుల‌కు న‌చ్చ‌జెప్పి ట్రాఫిక్ ఇబ్బందులను తొల‌గించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

Hyderabad
Police
  • Loading...

More Telugu News