Nagababu Konidela: పేర్ని నాని.. మీరు కరోనా వ్యాక్సిన్ తో పాటు రేబిస్ వ్యాక్సిన్ కూడా వేయించుకోండి: నాగబాబు

Send Rabies vaccine to Perni Nani says Nagababu

  • 'వకీల్ సాబ్' స్పెషల్ షోల వివాదం 
  • స్పెషల్ షోలపై సెటైర్లు వేసిన పేర్ని నాని
  • నానికి రేబిస్ వ్యాక్సిన్ పంపించాలన్న నాగబాబు

జనసేనాని పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం 'వకీల్ సాబ్' సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది. బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. అన్ని వర్గాల సినీ అభిమానులను ఆకట్టుకున్న ఈ చిత్రం మంచి రేటింగ్ సాధించింది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించి మొదలైన వివాదం రోజుకో మలుపు తిరుగుతూ చర్చనీయాంశంగా మారింది.

ఈ సినిమా బెనెఫిట్ షోలు, ఎక్స్ ట్రా షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతిని నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో, పవన్ కల్యాణ్ కు భయపడే స్పెషల్ షోలకు జగన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని ఏపీ బీజేపీ ఇన్ఛార్జి సునీల్ దేవధర్ విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని స్పందిస్తూ... 'మీకు దురద ఉందని తెల్లవారుజామున 5 గంటలకే వెళ్తే షో వేయరు సునీల్ గారూ' అంటూ వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యల నేపథ్యంలో పేర్ని నానిపై పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ, 'మీకు ఏమి అయ్యింది నాని గారు. మీరు కరోనా వాక్సిన్ తో పాటు రేబిస్ వాక్సిన్ కూడా వేసుకోవాలి. ఇట్స్ అర్జంట్. ప్లీజ్ సెండ్ రేబిస్ వాక్సిన్ టు మిస్టర్ నాని, స్టేట్ ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్. వాక్సిన్ డొనేట్ చేయాలనుకునే వారు ఆయన పేరు చెబితే రవాణా ఖర్చులు ఫ్రీ' అని వ్యాఖ్యానించారు. కుక్క కరిచిన వారికి రేబిస్ ఇంజెక్షన్లు వేస్తారనే విషయం తెలిసిందే.

  • Error fetching data: Network response was not ok

More Telugu News