Devineni Uma: తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో వందల కోట్లు చేతులు మారుతున్నాయి: దేవినేని ఉమ ఆరోపణలు
- కేంద్ర ఎన్నికల సంఘం దృష్టిసారించాలి
- వైసీపీ నేతలు ఇసుకను దోచుకుంటున్నారు
- జగన్ అహంకారాన్ని ప్రజలు ఓటుతో దించాలి
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో వందల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని ఆయన ఆరోపణలు గుప్పించారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టిసారించాలని ఆయన కోరారు. వైసీపీ నేతలు పోలవరం నుంచి పెన్నా వరకు ఇసుకను దోచుకుంటున్నారని ఆయన అన్నారు. జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక పోలవరం పనులు 2 శాతం కూడా జరగలేదని ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు ఇప్పుడు దళారుల కేంద్రాలుగా మారాయని ఆయన విమర్శలు గుప్పించారు. త్వరలో జరగనున్న తిరుపతి ఉప ఎన్నికలో జగన్ అహంకారాన్ని ప్రజలు ఓటుతో దించాలని ఆయన సూచించారు. ఏపీలో వాలంటీర్లు వైసీపీ కార్యకర్తల కంటే ఘోరంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.