Corona Virus: కరోనా వ్యాక్సిన్ల కొరత.. ముంబయిలో ప్రైవేటు కేంద్రాలు బంద్!‌

Vaccination at pvt centres will be shut in mumbai

  • సోమవారం వరకు మూసి ఉంచాలని నిర్ణయం
  • టీకాలు వచ్చిన తర్వాత తెరుస్తామని వెల్లడి
  • ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొనసాగనున్న వ్యాక్సినేషన్‌
  • నేడు మహారాష్ట్రకు లక్ష డోసుల టీకా

కరోనా వ్యాక్సిన్ల కొరత కారణంగా ముంబయిలోని ప్రైవేట్ టీకా కేంద్రాలను సోమవారం వరకు మూసివేస్తున్నట్లు బృహత్‌ ముంబయి కార్పొరేషన్‌(బీఎంసీ) ప్రకటించింది. ప్రభుత్వ, మున్సిపల్‌ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మాత్రం వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేసింది.

ఈరోజు (ఏప్రిల్‌ 9) రాత్రి లక్ష డోసులు అందనున్నాయని బీఎంసీ తెలిపింది. మరిన్ని డోసులు రాష్ట్రానికి చేరిన వెంటనే ప్రైవేటు టీకా కేంద్రాలను పునరుద్ధరిస్తామని వెల్లడించింది. బీఎంసీ పరిధిలో 49 ప్రభుత్వ, 71 ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో టీకా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా రోజుకు 40 వేల నుంచి 50 వేల మందికి టీకాలిస్తున్నారు. కానీ, ఈరోజు దాదాపు ప్రైవేట్‌ కేంద్రాలన్నీ మూసివేసినప్పటికీ 33,531 మందికి టీకా అందించగలిగారు. దేశంలో కరోనా వ్యాప్తి భారీ స్థాయిలో ఉన్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర ముందున్న విషయం తెలిసిందే.

Corona Virus
corona vaccine
Mumbai
BMC
  • Loading...

More Telugu News