Pavan kalyan: 'వకీల్ సాబ్ తో పవన్ జాతర షురూ!' అంటున్న హరీశ్ శంకర్

Anil Raviipudi Comments on Vakeel Saab Movie

  • ఈ రోజునే థియేటర్లకు వచ్చిన 'వకీల్ సాబ్'
  • థియేటర్ల దగ్గర అభిమానుల కోలాహలం
  • ఇండస్ట్రీ వైపు నుంచి తగ్గని సందడి    

పవన్ కల్యాణ్ అనే పేరు వింటే చాలు ఆయన అభిమానులు ఊగిపోతారు .. చెలరేగిపోతారు. ఆయన సినిమాను చూస్తూ అన్ని పండుగలు థియేటర్లోనే జరిపేసుకుంటూ ఉంటారు. అలాంటిది అయన గ్యాప్ ఇచ్చి చేసిన సినిమా వస్తుందంటే ఊరుకుంటారా? అలా పవన్ చేసిన 'వకీల్ సాబ్' ఈ రోజున రిలీజ్ కాగానే అభిమానులు థియేటర్లను కమ్ముకున్నారు. 'వకీల్ సాబ్' తిష్ఠ వేసిన ప్రతి థియేటర్ ముందు జాతర జరిపారు. విడుదలైన ప్రతి ప్రాంతంలోనూ పవన్ అభిమానులు దాహం తీర్చుకున్నారు.


ఈ నేపథ్యంలో ఈ సినిమా చూసిన టాలీవుడ్ దర్శకులు కొందరు తమదైన శైలిలో స్పందించారు. దర్శకుడు అనిల్ రావిపూడి ... 'వకీల్ సాబ్' జడ్జిమెంట్ .. పవర్ఫుల్ బ్లాక్ బస్టర్ .. పవన్ కల్యాణ్ వన్ మేన్ షో ఇది. వేణు శ్రీరామ్ రచన .. దర్శకత్వం సూపర్బ్. తమన్ సంగీతం .. బీజీయం చాలా బాగున్నాయి. ఇంతమంచి సినిమాను అందించిన 'దిల్'రాజుకు .. శిరిష్ కు బిగ్ కంగ్రాట్స్ " అంటూ ట్వీట్ చేశాడు. ఇక పవన్ తో ఇంతకుముందు 'గబ్బర్ సింగ్' చేసిన హరీశ్ శంకర్ .. 'జాతర షురూ అయింది' అంటూ పవన్ అభిమానులను హుషారెత్తించాడు. ఆయన పట్ల తనకి గల అభిమానాన్ని చాటుకున్నాడు.

Pavan kalyan
Sruthi Haasan
Niveda Thomas
Anjali
  • Loading...

More Telugu News