Kinjarapu Ram Mohan Naidu: ఓట్ల కోసం ఇంటింటికీ లేఖ‌లు రాస్తున్నారు: టీడీపీ ఎంపీ రామ్మోహ‌న్ విమర్శలు

ram mohan slams jagan

  • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ అభివృద్ధి కోసం కేంద్ర ప్ర‌భుత్వానికి లేఖ రాయ‌లేదు
  • తిరుప‌తి ఉప ఎన్నిక‌లో ఓట్ల కోసం మాత్రం ప్ర‌జ‌ల‌కు లేఖ‌లు
  • కేంద్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తే  జగన్‌ను జైలులో పెడతారనే భయం
  • అందుకే వైసీపీ ఎంపీలు పార్ల‌మెంటులో మాట్లాడలేక పోతున్నారు

వైసీపీపై టీడీపీ ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు మండిప‌డ్డారు. తిరుప‌తిలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి కేంద్ర విద్యా సంస్థ‌లు, రాష్ట్రంలో అభివృద్ధి ప‌నుల కోసం కేంద్ర ప్ర‌భుత్వానికి లేఖ రాయ‌ని జ‌గ‌న్..  తిరుప‌తి ఉప ఎన్నిక‌లో ఓట్ల కోసం మాత్రం ఇంటింటికీ లేఖ‌లు రాస్తున్నార‌ని ఆయ‌న విమర్శించారు.

కేంద్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తే జగన్‌ను జైలులో పెడతారనే భయంతోనే వైసీపీ ఎంపీలు పార్ల‌మెంటులో మాట్లాడలేక పోతున్నారన్నారని ఆయ‌న‌ ఆరోపించారు. త‌న‌ కేసుల నుంచి ఎలా బయటపడాలనే విష‌యంపైనే జగన్ ఆలోచిస్తున్నార‌ని, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల గురించి ఆలోచించ‌ట్లేద‌ని చెప్పారు.

టీడీపీ పాల‌న‌లోనే తిరుపతిలో అభివృద్ధి ప‌నులు జరిగాయ‌ని ఆయ‌న అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా చేపట్టారా? అని ప్ర‌శ్నించారు. తిరుప‌తి ఉప ఎన్నికలో త‌మ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో వైసీపీ నేత‌లు ఇసుక అమ్ముకుని అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.

Kinjarapu Ram Mohan Naidu
Telugudesam
YSRCP
Tirupati
  • Loading...

More Telugu News