Vijay: నయనతార తరువాత పూజ హెగ్డేనే!

Pooja hegde takes high remunerationfor vijay movie
  • నెంబర్ వన్ స్థానంలో పూజ హెగ్డే
  • వరుసగా స్టార్ హీరోల జోడీగా అవకాశాలు
  • కోలీవుడ్లో దక్కిన భారీ ప్రాజెక్టు  
కథానాయికగా రాణించాలంటే అందం ఒక్కటే ఉంటే సరిపోదు .. అదృష్టం కూడా తోడవ్వాలి. అందం .. అదృష్టం ఉన్నవారు చెలరేగిపోతారనుకుంటే పొరపాటే .. కాస్తంత లౌక్యం కూడా కావాలి. ఈ మూడు లక్షణాలు ఉన్న కథానాయికలే చిత్రపరిశ్రమలో గెలుస్తారు .. నిలుస్తారు. అలాంటి లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్లనే, పూజ హెగ్డే చిచ్చు బుడ్డిలా ఒకచోటునే కాలుతూ కూర్చోకుండా తారాజువ్వలా దూసుకుపోతోంది. టాలీవుడ్ లో ఇప్పుడు ఆమె నెంబర్ వన్ పొజిషన్ ను ఎంజాయ్ చేస్తోంది.  


ముద్దు వచ్చినప్పుడే చంకను ఎక్కాలి .. గారం చేసినప్పుడే గారెలు అడగాలి అనే సామెతలా, తనకి గల డిమాండును బట్టే పూజ హెగ్డే పారితోషికం పెంచుతూ వెళుతోంది. ఇటీవలే పూజ తమిళంలో విజయ్ 65వ సినిమాను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమా కోసం ఆమె అందుకోనున్న పారితోషికం 3 కోట్లు అంటున్నారు.

తెలుగుతో పాటు హిందీలోను ఆమెకి క్రేజ్ ఉండటంతో నిర్మాతలు అంగీకరించారని చెప్పుకుంటున్నారు. కోలీవుడ్లో నయనతార తరువాత ఈ స్థాయి పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ పూజ హెగ్డేనే అంటున్నారు. ఇక కోలీవుడ్ లోను ఈ కోమలి తన హవా సాగిస్తుందేమో చూడాలి.
Vijay
Pooja Hegde
Kollywood

More Telugu News