America: మిర్యాలగూడ వాసికి అమెరికాలో అరుదైన గౌరవం.. ‘కామ్‌స్కోప్’ సీఐవోగా జొన్నలగడ్డ ప్రవీణ్

Miryalaguda man praveen became CIO to CommScope

  • 12 ఏళ్లుగా వివిధ హోదాల్లో సేవలు
  • సంస్థలోని 50 మంది సాంకేతిక నిపుణుల్లో ముఖ్యుడు
  • ఉస్మానియ యూనివర్సిటీ నుంచి ఏఐలో పీహెచ్‌డీ

నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన జొన్నలగడ్డ ప్రవీణ్ (45)కు అమెరికాలో అత్యంత అరుదైన గౌరవం లభించింది. వైర్‌లెస్, కమ్యూనికేషన్ సంస్థ కామ్‌స్కోప్‌కు చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (సీఐవో)గా నియమితులయ్యారు. సంస్థలోని 50 మంది సాంకేతిక నిపుణుల్లో ఆయన ముఖ్యుడిగా ఉండడంతోనే ఈ గౌరవం లభించింది. ప్రవీణ్ గత పుష్కరకాలంగా కామ్‌స్కోప్‌లోనే వివిధ హోదాల్లో పనిచేశారు. డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వంటి హోదాల్లో సేవలు అందించారు.

మిర్యాలగూడ మండలంలోని గూడూరుకు చెందిన ప్రవీణ్ అక్కడే గణితంలో బీఎస్సీ చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ చేశారు. 2001లో అదే యూనివర్సిటీ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ‌లో పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత వివిధ సంస్థల్లో పనిచేసిన ప్రవీణ్ 12 ఏళ్ల క్రితం కామ్‌స్కోప్‌లో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. ఇప్పుడు ఆ సంస్థకు సీఐవోగా నియమితులయ్యారు.

America
CommScope
Jonnalagadda praveen
Miryalaguda
  • Loading...

More Telugu News