French Open: వారం రోజులు వాయిదా పడిన ఫ్రెంచ్ ఓపెన్

French Open Tournament Postponed

  • మే 23న ప్రారంభం కావాల్సిన పోటీలు
  • 30 నుంచి ప్రారంభిస్తామన్న నిర్వాహకులు
  • గత సంవత్సరం ఐదు నెలలు వాయిదా

మే నెల 23న ప్రారంభం కావాల్సిన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ పోటీలు, కరోనా విజృంభణ కారణంగా వారం రోజుల పాటు వాయిదా పడ్డాయి. ఈ విషయాన్ని ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ సమాఖ్య గురువారం నాడు ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈ పోటీలు జరిపేందుకు ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు.

అయితే, ఈ పోటీలను వీలైనంత వరకూ ప్రేక్షకులకు అనుమతినిస్తూనే జరిపించాలని భావిస్తున్నామని వెల్లడించింది. గత సంవత్సరం కూడా ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ దాదాపు ఐదు నెలలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ లో జరిగిన పోటీలకు పరిమిత సంఖ్యలో వీక్షకులను అనుమతించారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొంది.

French Open
Tennis
Postpone
  • Loading...

More Telugu News