France: రోబో సైన్యం.. టెస్ట్​ చేసిన ఫ్రాన్స్​ ఆర్మీ

French army tests robot dog Spot for battlefield

  • స్పాట్ అనే జాగిలంపై ప్రత్యేక దృష్టి
  • వాటితో పాటు డ్రోన్లు, మినీ యుద్ధ ట్యాంకుల పరిశీలన
  • రెండ్రోజుల పాటు మిలటరీ స్కూల్ కార్యక్రమం

నాలుగు కాళ్లు.. తోక.. తలలేదు కానీ, చూడ్డానికి అచ్చం జాగిలం లాగానే కనిపిస్తుంది. కానీ, అది జీవి కాదు. ఓ రోబో. దాని పేరు స్పాట్. అదేం చేస్తుందంటారా? కదన రంగంలో సైన్యంతో కలిసి ముందుకు దూసుకుపోతుంది. సైన్యానికి అండగా ఉంటూ శత్రువుల పని పడుతుంది. దానిని ఫ్రెంచ్ సైన్యం మంగళవారం పరీక్షించింది. దాంతో పాటు మరికొన్ని రోబోలను యుద్ధ రంగంలోకి ప్రవేశపెడితే ఎలా పనిచేస్తాయో తెలుసుకుంది.


అమెరికాకు చెందిన బోస్టన్ డైనమిక్స్ అనే సంస్థ తయారు చేసిన ఆ రోబోలపై ఫ్రాన్స్ సైన్యం విస్తృతంగా పరీక్షలు జరుపుతోంది. మిలటరీ స్కూల్ ద ఎకోల్ స్పెషల్ మిలటరీ డీ సెయింట్ సిర్ (కంబైన్డ్ ఆర్మ్స్ స్కూల్) ఆధ్వర్యంలో వాటిని పరీక్షిస్తోంది. అందులో భాగంగానే మంగళవారం మిలటరీ స్కూల్ విద్యార్థులు వాటి పనితీరును పరిశీలించారు.

రెండ్రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో.. సంకట పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు చేయాల్సిన ఆపరేషన్లు, రాత్రి వేళల్లో రక్షణ, పట్టణ ప్రాంతాల్లో యుద్ధ సన్నద్ధత వంటి వాటిపై రోబోలకు శిక్షణనిచ్చినట్టు చెబుతున్నారు. అయితే, స్పాట్ లో బ్యాటరీనే ప్రధాన సమస్య అని చెబుతున్నారు. చాలా త్వరగా అందులో చార్జింగ్ అయిపోతోందని అంటున్నారు.


స్పాట్ తో పాటు ఎస్టోనేషియా సంస్థ మిల్రెమ్ తయారు చేసిన రిమోట్ తో నడిచే మినీ యుద్ధ ట్యాంకు ఆప్టియో ఎక్స్20, ఫ్రాన్స్ మిలటరీ నెక్ట్సర్ తయారు చేసిన రోబో మ్యూల్ అల్ట్రో, పలు రకాలుగా వాడుకునే వీల్డ్ డ్రోన్ బరాకుడాలను టెస్ట్ చేసింది. అయితే, భవిష్యత్ లో వాటిని ఎలా వాడుకుంటారన్న దానిపైనే నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News