Putin: అత్యాచార నిందితుడి ఫొటో బదులు రష్యా అధ్యక్షుడి ఫొటో... ఓ జాతీయ దినపత్రిక పొరబాటు

- పాత్రికేయుడు వరుణ్ హిరేమఠ్ పై అత్యాచార ఆరోపణలు
- నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
- వార్తలో వరుణ్ ఫొటో బదులు పుతిన్ ఫొటో
- సోషల్ మీడియాలో దుమారం
ముంబయి పాత్రికేయుడు వరుణ్ హిరేమఠ్ పై అత్యాచార ఆరోపణలు రావడం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన వార్తను ఓ జాతీయ దినపత్రిక ప్రచురించింది. అయితే అందులో వరుణ్ హిరేమఠ్ ఫొటోకు బదులు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫొటో ప్రచురించారు. దాంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. ఇలాంటి తప్పిదానికి పాల్పడ్డ పత్రికా యాజమాన్యం క్షమాపణలు చెప్పాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అత్యాచార కేసులో నిందితుడైన 28 ఏళ్ల వరుణ్ హిరేమఠ్ కు ఢిల్లీ న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన వార్త ప్రచురణలోనే ఈ ఫొటో తప్పిదానికి పాల్పడ్డారు.