YS Vijayamma: నాడు వైఎస్సార్ ది హత్యేమోనన్న అనుమానం కూడా వచ్చింది... కానీ మేం ఏం చేయగలిగాం?: వైఎస్ విజయమ్మ

YS Vijayamma open letter

  • వివేకా హత్యకేసులో పవన్ సహా నేతల వ్యాఖ్యలు
  • సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు
  • స్పందించిన వైఎస్ విజయమ్మ
  • కుమారుడికి మద్దతుగా 5 పేజీల బహిరంగ లేఖ
  • సీబీఐ దర్యాప్తు జరుగుతుంటే జగన్ ఏంచేయగలడని వ్యాఖ్యలు

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్ పై విపక్షాలు ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ స్పందించారు. వివేకా హత్య ఎవరు చేశారో నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేశారు. ఇది నా మాట, జగన్ మాట, షర్మిల మాట అని తేల్చి చెప్పారు. ఈ విషయంలో తమ కుటుంబానికి మరో అభిప్రాయం లేదని పేర్కొన్నారు. ఈ మేరకు విజయమ్మ 5 పేజీల బహిరంగ లేఖ రాశారు.

వివేకా హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తుందన్న విషయం పవన్ కల్యాణ్ కు తెలియదా? సీబీఐ దర్యాప్తు కేంద్రం చేతిలో ఉంటుందని తెలిసి కూడా పవన్ కల్యాణ్ విమర్శలు చేస్తున్నారు అని అసంతృప్తి వ్యక్తం చేశారు. నాడు వైఎస్ ది ప్రమాదవశాత్తు సంభవించిన మరణమా? లేక హత్యా? అని తమకు అనుమానం వచ్చినా, ఏంచేయలేకపోయామని తెలిపారు. జగన్ తన కేసు అయినా, తన బాబాయ్ కేసు అయినా సీబీఐ దర్యాప్తు చేస్తున్నప్పుడు ఏం చేయగలడని విజయమ్మ ప్రశ్నించారు.

YS Vijayamma
Open Letter
Jagan
YS Vivekananda Reddy
YSR
Andhra Pradesh
  • Loading...

More Telugu News