Trivikram Srinivas: ఎన్టీఆర్ మూవీపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత!

Producer Nagavamsi gave a clarity on NTR Movie

  • త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్
  • ప్రాజెక్టు ఆగిపోయిందంటూ ప్రచారం
  • త్వరలోనే రెగ్యులర్ షూటింగు మొదలయ్యే అవకాశం

ఎన్టీఆర్ తన తదుపరి సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నాడు. త్రివిక్రమ్ మూవీ 'అల వైకుంఠపురములో' విడుదలకాక ముందు నుంచే ఈ టాక్ వినిపిస్తూ వచ్చింది. ఆ తరువాత ఎన్టీఆర్ - త్రివిక్రమ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు కూడా. ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న రాజమౌళి సినిమా పూర్తి కాగానే, త్రివిక్రమ్ తో కలిసి ఎన్టీఆర్ సెట్స్ పైకి వెళతాడని అనుకున్నారు. కానీ అలా జరగకపోవడంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయిందనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. దాంతో అభిమానులు నిరాశకి లోనవుతున్నారు.

అయితే బలంగా జరుగుతున్న ప్రచారాన్ని చూస్తూ ఊరుకుంటే, అదే నిజమని అనుకునే అవకాశం ఉంది గనుక, ఈ సినిమా నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందించారు. 'అది నైస్ జోక్ గైస్ ' అని ట్వీట్ చేస్తూ, ఫన్నీ ఇమోజిస్ జత చేశారు. అలా ఆయన ఈ సినిమా ఆగిపోయిందంటూ జోరుగా జరుగుతున్న ప్రచారానికి తెర దించేశారు.

కోవిడ్ వైపు నుంచి పరిస్థితులు అనుకూలంగా ఉంటే, ఈ నెల చివరిలోగానీ .. వచ్చేనెల మొదటివారంలో గాని 'అయిననూ పోయిరావలె హస్తినకు' రెగ్యులర్ షూటింగు మొదలు కావొచ్చని చెబుతున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News