Tablets: ప్రత్యేకంగా కరోనా చికిత్స కోసం మాత్రలు... త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం!

Tablets to come in treatment of corona
  • కేవలం కరోనా చికిత్స కోసమే ప్రత్యేకంగా ఔషధం
  • ఇప్పటివరకు ఇతర వ్యాధుల ఔషధాల వాడకం
  • సంయుక్తంగా అభివృద్ధి చేసిన మెర్క్-రిడ్జ్ బ్యాక్
  • మోల్నుపిరావిర్ పేరిట మాత్రలు
  • ప్రయోగాల్లో ఆశాజనకంగా ఫలితాలు
కరోనా మహమ్మారి సోకిన వారికి ఇప్పటివరకు ఇతర వ్యాధుల్లో ఉపయోగించే రెమ్ డెసివిర్, పావిపిరావిర్ వంటి శక్తిమంతమైన ఔషధాలు వాడుతున్నారు. ప్రత్యేకించి కరోనా కోసం ఎలాంటి ఔషధాలు లేవు. అయితే మెర్క్, రిడ్జ్ బ్యాక్ ఫార్మా సంస్థలు కేవలం కరోనా కోసమే ఓ ఔషధాన్ని అభివృద్ధి చేశాయి. దీని పేరు మోల్నుపిరావిర్. ఇది మాత్రల రూపంలో ఉంటుంది. కరోనా రోగులపై మోల్నుపిరావిర్ మాత్రలను 5 రోజుల పాటు పరీక్షించి చూడగా, వారిలో వైరస్ కణాల సంఖ్య బాగా తగ్గిపోయినట్టు గుర్తించారు.

గతంలో ఫ్లూ జ్వరాలు బాగా ప్రబలినప్పుడు టామీ ఫ్లూ పేరుతో దానికోసమే ప్రత్యేక ఔషధం తీసుకువచ్చారు. అది అమోఘమైన ఫలితాలను ఇచ్చింది. ఇప్పుడు కరోనాపై మోల్నుపిరావిర్ కూడా అదే రీతిలో ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. మనిషి దేహంలో ప్రవేశించిన కరోనా వైరస్ తిరిగి ఉత్పత్తి కాకుండా మోల్నుపిరావిర్ అడ్డుకుంటుంది. తద్వారా శరీరంలో వైరస్ వ్యాప్తిని తగ్గిస్తుంది. ఇది త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Tablets
Molnupiravir
Merck
Ridgeback
Corona Virus

More Telugu News