KTR: కేటీఆర్ చేతుల మీదుగా హైటెక్‌ సిటీ రైల్వే అండర్‌ బ్రిడ్జి ప్రారంభం

open newly constructed RUB developed under the Strategic Road Development Program

  • కేపీహెచ్‌బీ నుంచి హైటెక్‌ సిటీకి వెళ్లే దారిలో నిర్మాణం
  • రూ.66.59 కోట్ల వ్యయం
  • 410 మీటర్ల పొడవు, 20.60 మీటర్ల వెడల్పుతో బ్రిడ్జి

కేటీఆర్ చేతుల మీదుగా హైద‌రాబాద్‌లోని హైటెక్‌ సిటీ రైల్వే అండర్‌ బ్రిడ్జి ఈ రోజు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఇంకా మంత్రి మల్లారెడ్డి, మేయర్‌ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్‌ఆర్డీపీ)లో భాగంగా కేపీహెచ్‌బీ నుంచి హైటెక్‌ సిటీకి వెళ్లే దారిలో రూ.66.59 కోట్ల వ్యయంతో 410 మీటర్ల పొడవు, 20.60 మీటర్ల వెడల్పుతో ఈ బ్రిడ్జిని నిర్మించారు.
          
దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు  తొలగిపోనున్నాయి. గతంలో పాత బ్రిడ్జి కింద నిత్యం 35 నుంచి 40వేల లీటర్ల నీరు ఊరుతూ ఉండేది.  అందులోనే వాహనదారుల రాకపోకలు కొన‌సాగించేవారు. కాగా, ఈ బ్రిడ్జి ప్రారంభోత్స‌వం ముందు హైద‌రాబాద్‌లోని మూసాపేటలో బీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులను కూడా మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.

అంబేద్కర్ నగర్‌ నుంచి డంపింగ్‌ యార్డు వరకు ఆ రోడ్డు నిర్మాణం జరగనుంది.  కైతలాపూర్‌లో డంపింగ్‌ యార్డు సమస్య ఉందని, స్థానికులకు ఇబ్బంది లేకుండా చెత్త తరలింపు పాయింట్‌ను ఏర్పాటు చేస్తామ‌ని ఈ సంద‌ర్భంగా కేటీఆర్ చెప్పారు. వ‌ర్షాకాలంలో ఇళ్లలోకి నీరు రాకుండా చర్యలు చేపడతామ‌ని తెలిపారు.

  • Loading...

More Telugu News