Bandi Sanjay: భూపాలపల్లి వద్ద బండి సంజయ్ అరెస్ట్... తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ

Police arrests Bandi Sanjay

  • విద్యార్థి సునీల్ నాయక్ ఆత్మహత్య
  • అంత్యక్రియలకు హాజరయ్యేందుకు యత్నించిన సంజయ్
  • అడ్డుకున్న పోలీసులు
  • ఓ ఎంపీని అడ్డుకుంటారా అంటూ బీజేపీ ఫైర్

కాకతీయ వర్సిటీకి చెందిన సునీల్ నాయక్ అనే విద్యార్థి ఉద్యోగాల భర్తీ అంశం నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే సునీల్ నాయక్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు మంథని నుంచి మహబూబాబాద్ వెళుతున్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. భూపాలపల్లి అడవి వద్ద సంజయ్ వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు, ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

దీనిపై తెలంగాణ బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఓ ప్రకటన చేసింది. సర్కారు దుర్మార్గానికి ఇది నిదర్శనం అని పేర్కొంది.  "ఒక ఎంపీని ఇలా అడ్డుకోవడం చూస్తుంటే రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అనిపిస్తోంది. బాధల్లో ఉన్న కుటుంబాన్ని ఓదార్చేందుకు వెళితే అడ్డుకుంటారా?" అని మండిపడింది.

Bandi Sanjay
Arrests
Police
BJP
Sunil Naik
Telangana
  • Loading...

More Telugu News