Congress: ఎస్ఈసీ స‌మావేశం ప్రారంభం.. హాజరైన ఆయా పార్టీల ప్ర‌తినిధులు

ycp cong participate in sec meeting

  • హాజ‌రుకాని టీడీపీ, జ‌న‌సేన, బీజేపీ ప్ర‌తినిధులు
  • వైసీపీ, కాంగ్రెస్‌, సీపీఎం పార్టీల నేత‌లు హాజ‌రు
  • ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో స‌హ‌కారంపై చ‌ర్చ‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌ర‌గ‌నున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేప‌థ్యంలో ఏపీలోని   పార్టీలతో ఎన్నిక‌ల సంఘం సమావేశం ప్రారంభ‌మైంది. ఈ స‌మావేశానికి వైసీపీ, కాంగ్రెస్‌, సీపీఎం పార్టీల ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు. ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో స‌హ‌కారంపై ఆయా పార్టీల నేత‌లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని చ‌ర్చిస్తున్నారు.

ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఎన్నికలపై ముందుగా చర్చించ‌కుండానే ఎస్ఈసీ షెడ్యూల్ ను ప్ర‌క‌టించ‌డం స‌రికాద‌ని ఆయా పార్టీలు అంటున్నాయి. ఇటువంటి నిర్ణ‌యాల వ‌ల్ల‌ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలా జ‌రుగుతాయ‌ని ప్ర‌శ్నిస్తున్నాయి.  కాగా, ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నిక‌లను ఈ నెల 8న నిర్వహించనున్నారు.

Congress
YSRCP
Telugudesam
Local Body Polls
  • Loading...

More Telugu News