Siddipet District: ప్రేమకు పెద్దల నిరాకరణ.. ప్రియురాలితో వీడియోకాల్‌లో మాట్లాడుతూ గొంతు కోసుకున్న యువకుడు

young man died by slit his throat in siddipet

  • సిద్దిపేటలో ఘటన
  • పంచాయితీలో ఇద్దరూ దూరంగా ఉండేలా రాజీ
  • సర్జికల్ బ్లేడుతో గొంతు, మణికట్టు కోసుకుని బలవన్మరణం

తమ ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ప్రియురాలితో వీడియోకాల్‌లో మాట్లాడుతూ గొంతు కోసుకున్నాడు. సిద్దిపేటలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక అరుంధతి కాలనీకి చెందిన బి.మనోజ్‌కుమార్ (25) ల్యాబ్ టెక్నీషియన్‌. ఓ యువతితో అతడు ప్రేమలో పడగా, విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది. విషయం పంచాయితీ వరకు వెళ్లడంతో ఇద్దరూ దూరంగా ఉండేలా రాజీ కుదిరింది.

అయితే, ప్రియురాలిని విడిచి దూరంగా ఉండలేని మనోజ్ తీవ్ర మనోవేదనకు లోనయ్యాడు. బుధవారం రాత్రి భోజనాల తర్వాత పై అంతస్తులోని తన గదికి వెళ్లాడు. అర్ధరాత్రి తర్వాత ప్రియురాలికి వీడియో కాల్ చేశాడు. ఆమెతో మాట్లాడుతూనే సర్జికల్ బ్లేడ్‌తో గొంతు, మణికట్టు కోసుకున్నాడు.

దీంతో కంగారుపడిన ఆమె అతడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు పై గదికి చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న కుమారుడిని సిద్దిపేట ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించడంతో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Siddipet District
Love
Suicide
  • Loading...

More Telugu News