KCR: రజనీకి ఫాల్కే అవార్డు రావడం గొప్ప విషయం: కేసీఆర్

Rajinikanth congratulates Rajinikanth

  • రజనీకి ఫాల్కే అవార్డు ప్రకటించిన కేంద్రం
  • హర్షం వ్యక్తం చేసిన కేసీఆర్
  • దశాబ్దాలుగా ప్రత్యేక శైలిని చాటుకున్నారని కితాబు

సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కు కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రజనీకాంత్ పై ఆయన ప్రశంసలు కురిపించారు. నటుడిగా రజనీ దశాబ్దాల పాటు తనకంటూ ఒక ప్రత్యేక శైలిని చాటుకున్నారని కితాబునిచ్చారు. నేటికీ దేశ, విదేశాల్లో కోట్లాది మంది అభిమానుల ఆదరణ పొందుతున్న రజనీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం గొప్ప విషయమని అన్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయం అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

KCR
TRS
Rajinikanth
Dadasaheb Award
  • Error fetching data: Network response was not ok

More Telugu News