India: ఇండియాలో ల్యాండ్ అయిన మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు!

Another 3 Rafele Jets Delivered to India

  • నిన్న రాత్రి భారత్ కు చేరిక
  • మార్గమధ్యంలో గాల్లేనే ఇంధనాన్ని నింపిన యూఏఈ
  • మొత్తం 14 విమానాలు వాయుసేన అమ్ములపొదిలో

ఫ్రాన్స్ లోని దస్సాల్ట్ ఏవియేషన్ నుంచి మరో మూడు రాఫెల్ ఫైటర్ జెట్లు ఇండియాకు చేరాయి. ఇవి ఫ్రాన్స్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరి మధ్యలో ఎక్కడా ఆగకుండా ఇండియాకు చేరాయి. మార్గమధ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన ట్యాంకర్ విమానాలు వీటికి అవసరమైన ఇంధనాన్ని గాల్లేనే నింపాయి.

ఇవి నిన్న రాత్రి భారత భూభాగంపై దిగాయని భారత వాయుసేన తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. అయితే, ఈ విమానాలు ఎక్కడ ల్యాండ్ అయ్యాయన్న విషయాన్ని మాత్రం వాయుసేన వెల్లడించలేదు. ఇక వీటికి అవసరమైన ఇంధనాన్ని అందించిన యూఏఈకి కృతజ్ఞతలు పేర్కొంది.

కాగా, తాజాగా మూడు విమానాలు వచ్చి చేరడంతో వాయుసేన వద్ద ఉన్న మొత్తం రాఫెల్ విమానాల సంఖ్య 14కు చేరింది. ఈ నెలాఖరులోగా మరో ఐదు విమానాలు డెలివరీ కానున్నాయి. వీటి చేరికతో వాయుసేన బలం మరింతగా పెరగనుందని ఉన్నతాధికారులు వ్యాఖ్యానించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News