Interest Rates: బ్రేకింగ్... వడ్డీ రేట్ల తగ్గింపును వెనక్కు తీసుకున్నామన్న నిర్మలా సీతారామన్!

Nirmala Says Interest Rates Reduced Desission is Taken Back

  • వడ్డీని తగ్గిస్తూ నిన్న రాత్రి ప్రకట
  • ఈ నిర్ణయం తొందరపడి తీసుకున్నారు
  • ట్విట్టర్ ఖాతాలో నిర్మలా సీతారామన్

అన్ని రకాల పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను భారీగా తగ్గిస్తూ, నిన్న కేంద్రం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తగా, ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఉదయం ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని తొందరపడి తీసుకున్నారని, వీటిని అమలు చేయబోవడం లేదని ఆమె ఓ ప్రకటనలో వెల్లడించారు. 2020-2021 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో అమలైన వడ్డీ రేట్లే తదుపరి కూడా అమలవుతాయని ఆమె స్పష్టం చేశారు.

కాగా, జాతీయ పొదుపు ఖాతాలు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ తదితర అన్ని రకాల పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లు తగ్గడంతో మధ్య తరగతి డిపాజిట్ దారులపై తీవ్ర ప్రభావం పడుతుందన్న విమర్శలు వచ్చాయి. ఇదే సమయంలో నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఎన్నికలు జరుగుతుండటం, అందునా కీలకమైన రెండో దశ పోలింగ్ నేడు ప్రారంభమైన నేపథ్యంలో కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవడం గమనార్హం. ఇక తన నిర్ణయాన్ని అధికారిక ట్విట్టర్ ఖాతాలో నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News