Mamata Banerjee: తనపై మరో దాడి జరిగిందంటున్న మమతా బెనర్జీ!

Another Attack onMe says Mamata

  • కార్యకర్తను పరామర్శించేందుకు వెళుతుంటే దాడి
  • ఏ ద్రోహి వీళ్లకు ఆశ్రయం ఇచ్చాడో
  • ఎక్కడున్నా బెంగాల్ కు లాక్కొచ్చి తీరుతానన్న మమత

ప్రత్యర్థులు జరిపిన దాడిలో గాయపడిన ఓ తృణమూల్ కార్యకర్తను కలిసేందుకు తాను వెళుతున్న వేళ, కొందరు వ్యక్తులు తన కారుపై దాడికి దిగారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. తనను హేళన చేస్తూ, దాడికి పాల్పడ్డారని, ఇందుకు సంబంధించిన వీడియోలు, చిత్రాలు తన వద్ద ఉన్నాయని అన్నారు. తనపై దాడి చేసేందుకు వారికి ఎంత ధైర్యం వచ్చిందని ప్రశ్నించారు. వీళ్లకు ఏ ద్రోహి ఆశ్రయం ఇచ్చాడోనని, అతను ఢిల్లీలో ఉన్నా, రాజస్థాన్ లో ఉన్నా, యూపీలో ఉన్నా బెంగాల్ కు లాక్కొస్తానని అన్నారు. ప్రస్తుతం కోడ్ అమలులో ఉంన్నందున తాను మాట్లాడటం లేదని తెలిపారు.

Mamata Banerjee
Car
Attack
  • Loading...

More Telugu News