NIA: భారత్‌లో ఉగ్రదాడులకు ప్రణాళికలు రచించిన అలీకి పదేళ్ల జైలు!

NIA Court Punishes terrorist Ali for 10 yrs jail
  • ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు
  • 2016లో భారీ ఆయుధాలతో పట్టుబడ్డ బహదూర్‌ అలీ
  • ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులకు ప్రణాళికలు
  • 2017లో ఓ ఎన్‌కౌంటర్‌లో హతమైన మరో ఇద్దరు ముష్కరులు
భారత్‌లో ఉగ్రదాడులకు ప్రణాళికలు రచించి.. పోలీసులకు చిక్కిన పాకిస్థాన్‌ ఉగ్రవాది బహదూర్‌ అలీకి ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. జమ్మూకశ్మీర్‌ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన లష్కరే తోయిబా ఉగ్రవాది బహదూర్‌ అలీతో పాటు మరికొంత మందిని 2016లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఏకే-47 తుపాకులు, గ్రనేడ్లు, ఆర్మీ మ్యాప్‌ సహా భారీ ఆయుధ సామగ్రితో కుప్వారాలో అలీ పోలీసులకు పట్టుబడ్డాడు.

వీరంతా ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులకు ప్రణాళికలు రచించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ మేరకు 2017 జనవరిలో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ అలీపై అభియోగ పత్రం దాఖలు చేసింది. ఇదే ఉగ్రకుట్రలో భాగమైన మరో ఇద్దరు పాకిస్థానీ తీవ్రవాదులు 2017 ఫిబ్రవరిలో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. ఉగ్రవాదులకు సాయం అందించిన కొంతమంది కశ్మీరీలను కూడా ఎన్‌ఐఏ అరెస్ట్‌ చేసి చార్జిషీట్‌ దాఖలు చేసింది.
NIA
Jammu And Kashmir
Terrorist
Encounter

More Telugu News