Rashmika Mandanna: నాగ్ పుషప్ చాలెంజ్ కు ఫన్నీగా బదులిచ్చిన రష్మిక

Rashmika funny reply to Ngarajuna push ups challenge

  • 'వైల్డ్ డాగ్' చిత్రం కోసం ప్రమోషన్ ఈవెంట్లు
  • పుషప్ చాలెంజ్ తో ఆన్ లైన్ ప్రచారం
  • రష్మిక పుషప్స్ కు అదిరిపోయే టైమింగ్ తో బదులిచ్చిన నాగ్
  • నాగ్ పుషప్స్ చూసి ఆశ్చర్యపోయిన రష్మిక
  • అలా చేయాలంటే తనకు ఏడాది పడుతుందని చమత్కారం

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే టాలీవుడ్ సెలబ్రిటీలు నాగార్జున, రష్మిక మందన్న మధ్య ఫన్నీ సంభాషణ చోటుచేసుకుంది. నాగ్ నటించిన 'వైల్డ్ డాగ్' చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా సినీ సెలబ్రిటీలకు పుషప్స్ చాలెంజ్ విసిరారు. ఈ చాలెంజ్ కు స్పందించిన రష్మిక కొన్నిసెకన్ల పాటు పుషప్ పొజిషన్ లో ఉండి ఆ వీడియోను ట్విట్టర్ లో పంచుకున్నారు. అయితే ఆ వీడియో పట్ల స్పందించిన నాగ్... పుషప్స్ తీయడం అంటే ఇలా అంటూ రష్మిక కంటే మరికాస్త ఎక్కువ సమయం పుషప్ పొజిషన్ లో నిలిచి సవాల్ విసిరారు. తన టైమింగ్ ను అధిగమించాలని రష్మికకు సవాల్ విసిరారు.

కాగా, ఈ సరదా సంభాషణలో రష్మిక స్పందిస్తూ... నాగ్ ఫిట్ నెస్ చూసి అచ్చెరువొందారు. 'సార్... మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో... ఏదో ఒకరోజు మిమ్మల్ని నా బాడీగార్డ్ గా అపాయింట్ చేసుకుంటా!' అంటూ చమత్కరించింది. అంతేకాదు, నాగ్ పుషప్ టైమింగ్ చూసి.... 'సార్, నేను మీలా చేయాలంటే ఓ సంవత్సరం పడుతుందేమో!' అని వ్యాఖ్యానించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News