Pawan Kalyan: పవన్ సినిమాలు చూస్తూ పెరిగాను.. ఇప్పుడు ఆయన పక్కన హీరోయిన్‌గా నటిస్తున్నాను: నిధి
![happy to work with pawan says nidhi](https://imgd.ap7am.com/thumbnail/cr-tn-60641419bcfed.jpg)
- ‘హరిహర వీరమల్లు’లో నటించడం గొప్ప అనుభూతినిస్తోంది
- పవన్ తో కలిసి పనిచేయాలన్న కల నెరవేరింది
- పవన్ చుట్టూ తెలియని ఏదో శక్తి దాగి ఉంది
- ఎన్నో విషయాలు నేర్చుకున్నా
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త సినిమా ‘హరిహర వీరమల్లు’లో ఆయన సరసన నిధి అగర్వాల్ నటిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... పవన్ కి తాను పెద్ద అభిమానినని చెప్పింది. ఆయన సినిమాలను చూస్తూ పెరిగానని, ఆయనతో కలిసి పనిచేయాలన్న తన కల‘హరిహర వీరమల్లు’లో నెరవేరుతోందని తెలిపింది.
పవన్ కల్యాణ్ గొప్ప నటుడని, అటువంటి నటుడితో కలిసి పని చేస్తుండటం గొప్ప అనుభూతినిస్తోందని చెప్పింది. పవన్ చుట్టూ తెలియని ఏదో శక్తి దాగి ఉందని చెప్పుకొచ్చింది. ఆయన సెట్‌లో అడుగుపెట్టగానే అందరూ పనులను ఆపేసి ఆయననే చూస్తుంటారని చెప్పింది.
రిహార్సల్స్ చేయాల్సివస్తే పవన్ కల్యాణ్ దాన్ని పనిలా కాకుండా ఆనందంగా చేస్తుంటారని తెలిపింది. పవన్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపింది. ‘హరిహర వీరమల్లు’లో తన పాత్ర అసాధారణమైందని, ఇది పీరియాడికల్ డ్రామా కావడంతో తాను అందుకు తగ్గ వస్త్రాల్లోనే కనిపిస్తానని తెలిపింది.
అంతేగానీ, ఇంతకుముందు సినిమాల్లా జీన్స్‌ల్లో కనిపించబోనని చెప్పింది. తన పాత్రను వెండితెరపై చూసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపింది. ఈ సినిమాలో తన పాత్ర కోసం మేకప్‌కు 90 నిమిషాలు పడుతోందని చెప్పింది.