Sharad Pawar: శరద్ పవార్ ఆరోగ్యం మెరుగ్గా ఉంది: మహారాష్ట్ర వైద్యశాఖ మంత్రి

Sharad Pawar doing well after operation
  • శరద్ పవార్ కు ముంబై ఆసుపత్రిలో సర్జరీ
  • గాల్ బ్లాడర్ లో రాళ్ల తొలగింపు
  • ప్రస్తుతం అబ్జర్వేషన్ లో ఉన్నారన్న వైద్యులు
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి వైద్యులు శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. సర్జరీ ద్వారా పిత్తాశయంలోని రాళ్లను తొలగించారు. ఆపరేషన్ తర్వాత శరద్ పవార్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే తెలిపారు.

డాక్టర్ అమిత్ మీడియాతో మాట్లాడుతూ, కొన్ని వైద్య పరీక్షల అనంతరం పవార్ కు శస్త్ర చికిత్సను నిర్వహించాలని నిర్ణయించారని చెప్పారు. ప్రస్తుతం పవార్ పరిస్థితి మెరుగ్గా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆయన వైద్యుల అబ్జర్వేషన్ లో ఉన్నారని చెప్పారు. ఒక వైద్యుల బృందం ఆయనను నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపారు.
Sharad Pawar
NCP
Surgery

More Telugu News