Mallareddy: కబడ్డీ ఆడుతూ కిందపడిన తెలంగాణ మంత్రి మల్లారెడ్డి... వీడియో ఇదిగో!

Minister Mall Reddy Slipped in Kabaddi Tourament

  • ఆటవిడుపుగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న మల్లారెడ్డి
  • కబడ్డీ పోటీల ప్రారంభోత్సవానికి హాజరు
  • ఆడుతూ కిందపడిన మంత్రి 

నిత్యమూ రాజకీయాల్లో తలమునకలై ఉండే నేతలు, అప్పుడప్పుడూ కాస్తంత ఆటవిడుపుగా స్థానిక ఈవెంట్లలో పాల్గొంటూ సేదదీరుతూ ఉంటారన్న సంగతి తెలిసిందే. తెలంగాణ మంత్రి హరీశ్ రావు, సిద్ధిపేట జిల్లాలో జరిగే ఎన్నో క్రికెట్ పోటీల్లో పాల్గొంటూ ఉంటారు. తాజాగా మరో మంత్రి మల్లారెడ్డి బోడుప్పల్ మునిసిపల్ కార్పొరేషన్ లో ప్రారంభమైన 68వ రాష్ట్ర స్థాయి సీనియర్ ఉమెన్ అండ్ మెన్ కబడ్డీ పోటీల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.

ఈ పోటీల్లో తనలోని కబడ్డీ నైపుణ్యాన్ని ప్రదర్శించాలని ఆయన అనుకున్నారు. ఆపై కూతకు వెళ్లారు. అంతవరకూ బాగానే ఉంది. అయితే, ఆటగాళ్లను తాకేందుకు ప్రయత్నించిన క్రమంలో పట్టుతప్పి కిందపడ్డారు. ఆ వెంటనే అక్కడున్న అధికారులు, మల్లారెడ్డి అనుచరులు ఆయన్ను పైకి లేపారు. ఈ ఘటనలో ఆయనకు ఎటువంటి గాయాలూ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దాన్ని మీరు కూడా చూడవచ్చు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News