Tollywood: 'ఆచార్య'లో చిరు స్టెప్పుల శాంపిల్‌ ఇదిగో..!

Acharya team released a song promo

  • ఆచార్యలోని ఓ సాంగ్‌ ప్రోమో విడుదల
  • 14 సెకన్ల నిడివి గల వీడియో
  • ఒక స్టెప్పుతో అదరగొట్టిన చిరంజీవి
  • రేపు సాయంత్రం 4:05 గంటలకు పూర్తి సాంగ్‌

చిరంజీవి అనగానే వెంటనే గుర్తొచ్చేది డ్యాన్స్‌. ఆయన స్టెప్పులకు ఫిదా అయ్యేవారు ఉండరనడంలో అతిశయోక్తి లేదు. రీఎంట్రీ సినిమా 'ఖైదీ నెం.150'లోనూ అదిరిపోయే డ్యాన్స్‌తో తన అభిమానుల నిరీక్షణకు సమాధానం చెప్పారు.

ఇప్పుడు మరోసారి మెగాస్టార్ తనదైన స్టెప్పులతో మెస్మరైజ్‌ చేయడానికి సిద్ధమయ్యారు. చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. రామ్‌చరణ్‌ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో ‘లాహే.. లాహే..’ పదాలతో సాగే గీతాన్ని ఈనెల 31న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ముందే ప్రకటించింది.

ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రొమోను మంగళవారం విడుదల చేశారు. కేవలం 14 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో ఒక్క స్టెప్‌తోనే చిరు వీక్షకుల్ని కట్టిపడేశారు. ఇక పూర్తి పాట‌లో తన నృత్యంతో ఎలా అలరిస్తారో చూడాలి మరి. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News