Kamal Haasan: కమలహాసన్ పై నిప్పులు చెరిగిన నటి గౌతమి!

Actress Gautami Fires on Kamal Hasan

  • కమల్ సరసన ఎన్నో సినిమాల్లో నటించిన గౌతమి
  • అసలు తమిళ ప్రజలు మార్పును కోరుకుంటున్నారా?
  • మే 2న విషయం తేలిపోతుందన్న గౌతమి

పలు సినిమాల్లో కమలహాసన్ పక్కన హీరోయిన్ గా నటించి, ఆపై ఆయనతో కొన్నేళ్ల పాటు సహజీవనం చేసి, అభిప్రాయభేదాల కారణంగా ప్రస్తుతం దూరంగా ఉంటున్న సినీ నటి గౌతమి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా, తమిళనాడులో జరిగిన ఓ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన ఆమె, కమల్ ను టార్గెట్ చేసుకున్నారు.

తాము అధికారం లోకి వస్తే, రాష్ట్రంలో మార్పును తెస్తామని కమల్ చెబుతున్నారని, అసలు అటువంటి మార్పును ప్రజలు కోరుకుంటున్నారా? లేదా? అన్న విషయం కౌంటింగ్ జరిగే మే 2న తేలిపోతుందని అన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు కమల్ మార్కెటింగ్ మాయాజాలాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు. ప్రస్తుతం గౌతమి భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Kamal Haasan
Gautami
Tamilnadu
Elections
  • Loading...

More Telugu News