Driving Licence: డ్రైవింగ్ లైసెన్స్ వాలిడిటీ మరో మూడు నెలలు పొడిగింపు... కేంద్రం కీలక నిర్ణయం

Centre extends driving licence validity

  • కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం నిర్ణయం
  • ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 మధ్య వ్యాలిడిటీ ముగిసేవారికి వర్తింపు
  • జూన్ 30 వరకు పత్రాలు చెల్లుబాటు
  • అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం

కరోనా వ్యాప్తి కారణంగా డ్రైవింగ్ లైసెన్స్ లను రెన్యువల్ చేయించుకోలేని వారికి కేంద్రం శుభవార్త చెప్పింది. డ్రైవింగ్ లైసెన్స్, ఇతర పత్రాల వ్యాలిడిటీని మరో మూడు నెలల పాటు పొడిగించాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ నిర్ణయించింది. అయితే, ఇది ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 మధ్య వ్యాలిడిటీ ముగిసేవారికి మాత్రమే వర్తిస్తుంది. కేంద్రం తాజా నిర్ణయం ప్రకారం వారి డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఇతర పత్రాలు జూన్ నెలాఖరు వరకు చెల్లుబాటు అవుతాయి. ఈ మేరకు కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది.

గతేడాది కూడా కరోనా తీవ్రత దృష్ట్యా డ్రైవింగ్ పత్రాల వ్యాలిడిటీని కేంద్రం పలుమార్లు పొడిగించింది. వాస్తవానికి 1988 మోటార్ వెహికిల్ యాక్ట్ ప్రకారం లైసెన్స్ కాలపరిమితి ముగిశాక ఏడాదిలోపు ఎప్పుడైనా పొడిగించుకోవచ్చు. కానీ కరోనా కారణంగా చాలామందికి అది సాధ్యపడలేదు. అందుకే కేంద్రం మరో మూడు నెలలు పొడిగించాలని నిర్ణయించింది.

  • Loading...

More Telugu News