Trailer: 'వకీల్ సాబ్' ట్రైలర్ ఇదిగో... పవన్ మార్కు హీరోయిజం గ్యారంటీ!

Vakeel Saab trailer out now

  • పవన్ హీరోగా 'వకీల్ సాబ్'
  • వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చిత్రం
  • థియేటర్లలోనూ, ఆన్ లైన్ లోనూ ట్రైలర్ విడుదల
  • ఏప్రిల్ 9న విడుదల కానున్న 'వకీల్ సాబ్'

పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ న్యాయవాది పాత్రలో వస్తున్న చిత్రం 'వకీల్ సాబ్'. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజైంది. థియేటర్లలో ప్రత్యేకంగా ప్రదర్శించిన ఈ ట్రైలర్ ను చిత్రబృందం ఆన్ లైన్ లోనూ పంచుకుంది. పవన్ కల్యాణ్ తనదైన శైలిలో హీరోయిజాన్ని ఎలివేట్ చేయడం ఈ ట్రైలర్ లో చూడొచ్చు.

కోర్టు, వాదనల నేపథ్యంలో వచ్చే సీన్లలో మరింత శక్తిమంతంగా కనిపించారు. ఇదివరకు టీజర్ లో "కోర్టులో వాదించడమూ తెలుసు, కోటు తీసి కొట్టడమూ తెలుసు" అంటూ పవన్ ఓ పవర్ ఫుల్ డైలాగ్ చెప్పగా, ఆ డైలాగ్ కరక్టేనని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన శ్రుతిహాసన్ నటిస్తుండగా... ప్రకాశ్ రాజ్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపుదిద్దుకున్న వకీల్ సాబ్ చిత్రానికి దిల్ రాజ్, ఆయన సోదరుడు శిరీష్ నిర్మాతలు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఏప్రిల్ 9న రిలీజ్ అవుతోంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News