Vaishnav Tej: వైష్ణవ్ తేజ్ సినిమాలో కేతిక శర్మ!

Vaishnav Tej to work with another new director

  • 'ఉప్పెన'తో వైష్ణవ్ కు బోలెడు ఆఫర్లు 
  • క్రిష్ దర్శకత్వంలో ఇప్పటికే ఓ ప్రాజక్ట్
  • బీవీఎస్ఎన్ ప్రసాద్ బ్యానర్లో ఇంకొకటి
  • గిరీశయ్య దర్శకత్వంలో రూపొందే సినిమా      

తొలి సినిమానే మంచి హిట్టయితే ఆ క్రేజే వేరు. ఇక ఆ హీరోకి, ఆ హీరోయిన్ కి లభించే గుర్తింపు వేరుగా ఉంటుంది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి మరో మేనల్లుడు వైష్ణవ్ తేజ్ విషయంలో కూడా అదే జరిగింది. తను నటించిన తొలిచిత్రం 'ఉప్పెన' బ్లాక్ బస్టర్ హిట్టయింది. కలెక్షన్లలో 100 కోట్ల క్లబ్బులోకి కూడా చేరింది. దాంతో ఈ చిత్రం ద్వారా పరిచయమైన వైష్ణవ్ తేజ్ కు బోలెడు ఆఫర్లు వస్తున్నాయి.

అసలు 'ఉప్పెన' రిలీజ్ కాకుండానే ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేశాడు. అది విడుదలకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ బ్యానర్లో ఓ చిత్రం చేయడానికి వైష్ణవ్ ఓకే చెప్పాడు. ఈ చిత్రానికి  గిరీశయ్య దర్శకత్వం వహిస్తాడు. 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా వద్ద గిరీశయ్య అసిస్టెంట్ గా పనిచేశాడు. అలాగే, 'అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్ కి దర్శకత్వం కూడా వహించాడు.

ఇక ఇందులో ముంబై మోడల్, ఇటీవల 'రొమాంటిక్' సినిమాలో కథానాయికగా నటించిన కేతిక శర్మను హీరోయిన్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెల నుంచి ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది.  

Vaishnav Tej
Uppena
Krish
Ketika Sharma
  • Loading...

More Telugu News