Somu Veerraju: క్యాబేజీ పువ్వులు పంపిస్తాం... బెయిల్ రద్దవగానే లోపల కూరకి ఉపయోగపడతాయి: విజయసాయిరెడ్డికి సోము వీర్రాజు కౌంటర్

Somu Veerraju counters Vijayasai Reddy remarks
  • వైసీపీ, బీజేపీ మధ్య విమర్శల పర్వం
  • చెవిలో క్యాబేజీ పూలు పెట్టండంటూ విజయసాయి వ్యాఖ్యలు
  • మా ఊసు ఎందుకులే అంటూ సోము వీర్రాజు రిప్లై
  • క్యాబేజీ పూలు మీకు పంపిస్తామంటూ వ్యాఖ్యలు
తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో వైసీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదిరింది. "మీరు వేస్తున్న డ్రామాలకు జనం నవ్వుకుంటున్నారు... ఉప ఎన్నికలో డిపాజిట్లు వస్తే చాలు మనవాడు సీఎం అయిపోతాడన్నట్టు నటిస్తున్నారు" అని విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. "ఎవరి పాత్రల్లో వారు జీవించండి, చెవిలో క్యాబేజీ పూలు పెట్టండి... జనం మాత్రం మళ్లీ వైసీపీనే దీవిస్తారు" అంటూ వ్యాఖ్యానించారు. దీనికి ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు గట్టిగా బదులిచ్చారు.

"మా ఊసు ఎందుకులే విజయసాయి రెడ్డి గారూ..! కోర్టులకు చెవిలో పువ్వులు పెడుతూ, వెలుపల మేకపోతు గాంభీర్యం కనబరుస్తూ తిరుగుతున్నప్పటికీ అలీబాబా నలబై దొంగలంతా లోపల గోళ్లు కొరుక్కుంటున్నారటగా" అని వ్యాఖ్యానించారు. "తిరుపతి ప్రజలకు మేం ఏం ఇచ్చామో చెప్పి క్యాబేజీ పువ్వులు మీకు పంపిస్తాం... బెయిల్ రద్దవగానే లోపల కూరకి ఉపయోగపడతాయి" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.
Somu Veerraju
Vijayasai Reddy
Tirupati LS Bypolls
BJP
YSRCP
Andhra Pradesh

More Telugu News