Ram Nath Kovind: దేశ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ముఖుల హోలీ శుభాకాంక్ష‌లు

kovind greets india

  • హోలీ సామాజిక సామ‌ర‌స్యాన్ని చాటే పండుగ: కోవింద్
  • ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం వెల్లివిరియాలి: మోదీ
  • నిబంధనలను అనుసరించి జరుపుకోవాలి: కేసీఆర్‌
  • ఆప్యాయ‌త‌, ప్రేమ‌, సంతోషాల హ‌రివిల్లు హోలీ: జ‌గ‌న్  

దేశ ప్ర‌జ‌లంతా హోలీ పండుగ‌ను ఉత్సాహంగా జ‌రుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దేశ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ముఖులు హోలీ శుభాకాంక్ష‌లు తెలిపారు. దేశ ప్ర‌జ‌ల‌కు హోలీ శుభాకాంక్ష‌లు చెబుతున్నాన‌ని రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు. హోలీ సామాజిక సామ‌ర‌స్యం చాటే పండుగ అని, ప్ర‌జ‌ల జీవితాల్లో సంతోషాలు నింపుతుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. జాతీయ‌వాద స్ఫూర్తిని ఈ పండుగ మ‌రింత బ‌ల‌ప‌ర్చాల‌ని కోరుకుంటున్నట్లు తెలిపారు.

దేశ ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోదీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. హోలీతో ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం వెల్లివిరియాలని, ఈ పండుగ‌ అందరిలో కొత్త శక్తిని నింపుతుందని చెప్పారు. అలాగే, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్ తో పాటు ప‌లువురు నేత‌లు ప్ర‌జ‌ల‌కు హోలీ శుభాకాంక్ష‌లు తెలిపారు.
 
తెలంగాణ‌ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్ మ‌ళ్లీ ప్రబలుతున్న నేపథ్యంలో ప్ర‌జ‌లు నిబంధనలను అనుసరించి హోలీ జరుపుకోవాలని  సూచించారు.

'ఆప్యాయ‌త‌, ప్రేమ‌, సంతోషాల హ‌రివిల్లు హోలీ! ప్ర‌తి ఒక్క‌రి జీవితం ఆనందాల‌తో నిండాల‌న్న ఆకాంక్ష హోలీ! ఈ హోలీ పండుగ వేళ రాష్ట్రంలోని ప్ర‌తి ఇంటా సంతోషాల స‌ప్త వ‌ర్ణాలు వెల్లివిరియాల‌ని నిండు మ‌న‌సుతో కోరుకుంటున్నాను!' అని ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

'ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ఈ రంగుల పండుగ మీ ఇంట శుభాలను కలిగించాలని మనసారా కోరుకుంటున్నాను. కరోనా మళ్లీ విజృంభిస్తున్న వేళ ఇంటిల్లిపాది జాగ్రత్తగా ఉండండి' అని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ట్వీట్ చేశారు.

'ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. కరోనా వ్యాప్తి పెరుగుతున్న వేళ జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో సభ్యులందరూ ఆరోగ్యంగా ఉంటే అంతకు మించిన పండుగ ఏముంది. సామూహిక వేడుకల్లో పాల్గొనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి' అని టీడీపీ నేత నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News