Liquor: భార్య మందు కొట్టిందని... చంపేసిన భర్త... విశాఖ జిల్లాలో కలకలం!

Husbend Kills wife after she DrinkLiquor

  • పాచిపెంట మండలంలో ఘటన
  • తల్లితో కలసి వెళ్లి మద్యం సేవించిన భార్య
  • క్షణికావేశంలో చంపేసిన భర్త

భార్య మందు తాగిందన్న క్షణికావేశంలో భర్త దాడి చేయడంతో ఆమె దుర్మరణం పాలైన ఘటన విశాఖ జిల్లా అరకు ప్రాంతంలో కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల్లోకి వెళితే, పాచిపెంట మండలం మాముతూరు గ్రామంలో శోభన్, తులసిలు పామాయిల్ తోటలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. శనివారం ఉదయం తన తల్లి రావడంతో తులసి ఆమెతో కలసి సాలూరుకు వెళ్లింది. తిరిగి సాయంత్రం వచ్చిన ఆమె పూటుగా మద్యం సేవించి వుండటంతో శోభన్ ఆమెను మందలించాడు.

ఈ క్రమంలో ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన శోభన్, తన భార్యను ఇంటికి కాస్తంత దూరం తీసుకెళ్లి, ఓ కర్రతో మొహంపై బలంగా కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావమైన తులసి అక్కడికక్కడే మరణించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి, కేసు నమోదు చేశారు. శోభన్ ను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ కొనసాగిస్తున్నామని తెలిపారు.

Liquor
Wife
Husbend
Vizag
Murder
  • Loading...

More Telugu News