Vizianagaram: విజయనగరంలో ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సులు, లారీ ఢీ: నలుగురి దుర్మరణం

5 dead and 30 injured in an Accident in Vizianagaram
  • గ్యాస్ సిలిండర్ల లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
  • బస్సును ఢీకొట్టిన మరో బస్సు
  • 30 మందికి తీవ్ర గాయాలు
విజయనగరం జిల్లాలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని సుంకరిపేట వద్ద ఎదురెదురుగా వచ్చిన గ్యాస్ సిలిండర్ల లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. అదే సమయంలో విశాఖ నుంచి విజయనగరం వైపు వెళ్తున్న మరో ఆర్టీసీ బస్సు ఈ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది.

ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న డంపింగ్ యార్డులో సిబ్బంది చెత్తను తగులబెట్టారు. దీంతో రహదారిని పొగ దట్టంగా కమ్మేయడంతో దారి కనిపించలేదు. ప్రమాదానికి ఇదే కారణమని తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Vizianagaram
Road Accident
RTC Bus

More Telugu News