Thaman: 'వకీల్ సాబ్' కోసం అదిరిపోయే బీజీఎం సిద్ధం చేసిన తమన్... ఆడియో క్లిప్ ఇదిగో!

Thaman shares BGM bit from Vakeel Saab
  • పవన్ ప్రధానపాత్రలో వకీల్ సాబ్
  • వేణు శ్రీరామ్ దర్శకత్వంలో సినిమా
  • పవన్ సరసన శృతిహాసన్ కథానాయిక
  • ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న వకీల్ సాబ్
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న 'వకీల్ సాబ్' చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, 'వకీల్ సాబ్' చిత్రానికి సంగీతం అందిస్తున్న తమన్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ను మెప్పించే రీతిలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ (బీజీఎం)ను సిద్ధం చేశాడు. దీనికి సంబంధించిన ఓ ఆడియో బిట్ ను తమన్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. "స్పీకర్లు సిద్ధం చేసుకోండి" అంటూ పవన్ ఫ్యాన్స్ కు పిలుపునిచ్చాడు. 'వకీల్ సాబ్' చిత్రం ఇటీవలే డబ్బింగ్ పనులు పూర్తి చేసుకుంది. తమన్ పోస్టును చూస్తుంటే ప్రస్తుతం రీ రికార్డింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది.

బాలీవుడ్ హిట్ చిత్రం 'పింక్' కు రీమేక్ గా తెలుగులో వస్తున్న 'వకీల్ సాబ్' చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకుడు. ఇందులో పవన్ సరసన శృతి హాసన్ కథానాయిక. అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల కీలకపాత్రలు పోషించారు. కాగా 'వకీల్ సాబ్' ట్రైలర్ ను రేపు ఎంపిక చేసిన థియేటర్లలో విడుదల చేయనున్నారు.
Thaman
BGM
Vakeel Saab
Pawan Kalyan
Tollywood

More Telugu News