బోటు కోసం పరిగెత్తుకెళ్లిన హీరోయిన్ కీర్తి సురేష్.. ఫన్నీ వీడియో
- ఇన్‌స్టాలో షేర్ చేసిన కీర్తి
- ఎక్కాల్సిన బోటు వెళ్లిపోతుండడంతో పరుగులు
- వెనకాలే ఉండి వీడియో తీసిన మరొకరు
దీంతో కీర్తి సురేష్ పరుగులు తీస్తూ బోటును ఆపాలని చేతిని చూపిస్తూ పరిగెత్తింది. ఆమె వెనకాలే పరిగెత్తుతూ ఈ దృశ్యాలను వీడియో తీస్తూ మరొకరు వచ్చారు. వీడియో తీయడాన్ని ఆపాలని కీర్తి సురేష్ చెప్పింది. ఈ వీడియోనే కీర్తి సురేష్ పోస్ట్ చేసింది.
కాగా, నితిన్‌తో కలిసి ఆమె నటించిన రంగ్ దే సినిమా ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ఆ సినిమా విడుదల నేపథ్యంలో ఆమె ఆ సినీ బృందంతో కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంది.