balka suman: జానారెడ్డిపై బాల్క సుమ‌న్ విమ‌ర్శ‌లు

balka suman slams jana reddy

  • కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లింది
  • ఆ పార్టీ తుడుచుపెట్టుకుపోయింది
  • జానారెడ్డికి ఓటమి భయం
  • ఎన్న‌డూ సామాన్య ప్రజలను పట్టించుకోలేదు 

నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి వ‌చ్చేనెల 17న జ‌ర‌గ‌నున్న‌ ఉప ఎన్నిక‌లో గెలుపే ల‌క్ష్యంగా పార్టీలు ప్రచారం చేసుకుంటున్నాయి. ఆ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున సీనియర్ నేత జానారెడ్డి పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా నిన్న ఆయ‌న త‌మ పార్టీపై చేసిన వ్యాఖ్య‌ల‌పై టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిప‌డ్డారు. కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లింద‌ని విమ‌ర్శించారు.

దేశంలో, తెలంగాణ‌లో ఆ పార్టీ తుడుచు పెట్టుకుపోయిందని చెప్పారు. ఈ నేప‌థ్యంలో నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌లో ఓటమి భయంతో జానారెడ్డికి వెన్నులో వ‌ణుకుపుడుతోంద‌ని విమ‌ర్శించారు. నిన్న  జానారెడ్డి  చేసిన వ్యాఖ్య‌లు ఆయ‌న‌ ఓటమిని ఒప్పుకున్నట్లుగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఆయ‌న ఎన్న‌డూ సామాన్య ప్రజలను పట్టించుకోలేదని బాల్క సుమ‌న్ ఆరోపించారు.

balka suman
Jana Reddy
Congress
  • Loading...

More Telugu News