Jonny Bairstow: గవాస్కర్ వ్యాఖ్యలకు గట్టిగా బదులిచ్చిన ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్ స్టో

Jonny Bairstow replies to Sunil Gavaskar remarks
  • భారత్ తో టెస్టు సిరీస్ లో బెయిర్ స్టో విఫలం
  • బెయిర్ స్టోలో ఆసక్తి లోపించిందన్న గవాస్కర్
  • భారత్ తో రెండో వన్డేలో బెయిర్ స్టో సెంచరీ
  • గవాస్కర్ ఇప్పుడు తనకు ఫోన్ చేసి మాట్లాడొచ్చంటూ వ్యాఖ్యలు
భారత్ తో టెస్టు సిరీస్ లో విఫలమైన ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్ స్టో వన్డే సిరీస్ లో మాత్రం విధ్వంసకర బ్యాటింగ్ ప్రదర్శిస్తున్నాడు. అయితే, టెస్టుల్లో బెయిర్ స్టో వైఫల్యం పట్ల ఇంతక్రితం భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ విమర్శలు చేశారు. బెయిర్ స్టో క్రీజులో కదిలే విధానం చూస్తుంటే ఆడేందుకు ఏమంత ఆసక్తిగా ఉన్నట్టు కనిపించడంలేదన్నారు. ఆ వ్యాఖ్యలను మనసులో పెట్టుకున్న బెయిర్ స్టో... నిన్న ముగిసిన రెండో వన్డేలో సూపర్ సెంచరీ సాధించిన అనంతరం నాటి వ్యాఖ్యలకు బుదులిచ్చాడు.

గవాస్కర్ ఒక్క ఫోన్ కాల్ చేస్తే టెస్టుల్లో ఆడేందుకు తానెంత కసిగా ఉన్నానో, ఆ ఫార్మాట్లో వినోదం అందించేందుకు తానేం చేయగలనో వివరిస్తానని వ్యాఖ్యానించాడు. "నా ఫోన్ ఎప్పుడూ ఆన్ లోనే ఉంటుంది. నాకు కాల్ చేయడమో, లేక ఎస్సెమ్మెస్ అయినా పంపడమో చేయొచ్చు" అని స్పష్టం చేశాడు. ఇప్పటివరకు గవాస్కర్ తో తాను మాట్లాడింది లేదని, తనతో గవాస్కర్ మాట్లాడింది లేదని, అలాంటప్పుడు తనపై ఎలా అభిప్రాయాలు వెల్లడిస్తారో తెలుసుకోవాలని కుతూహలంగా ఉందని వ్యంగ్యం ప్రదర్శించాడు.
Jonny Bairstow
Sunil Gavaskar
Test
ODI
England

More Telugu News