Corona Virus: హోలీ వేడుకలను నిషేధించిన రాష్ట్రాలు ఇవే!

States banned Holi

  • రేపు, ఎల్లుండి హోలీ పండుగ
  • కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో వేడుకలపై పలు రాష్ట్రాల నిషేధం
  • కోవిడ్ నిబంధనలను పాటిస్తూ వేడుకలు జరుపుకోవడానికి ఏపీ గ్రీన్ సిగ్నల్

మన దేశంలో ఈనెల 28, 29 తేదీల్లో హోలీ పండుగను జరుపుకోబోతున్నారు. అయితే, కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతున్న తరుణంలో అనేక రాష్ట్రాలు హోలీ వేడుకలకు అనుమతించడం లేదు.

మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, వేడుకలపై తెలంగాణ ఆంక్షలు విధించింది. వేడుకలకు అనుమతులు లేవని, ఆంక్షలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గేటెడ్ కమ్యూనిటీల్లో జరుపుకునే వేడుకలపై దృష్టి సారించామని పోలీసులు తెలిపారు. ఈవెంట్ ఆర్గనైజర్లకు హెచ్చరికలు జారీ చేశారు. ఏపీలో మాత్రం కోవిడ్ నిబంధనలకు లోబడి వేడుకలను జరుపుకోవచ్చని అధికారులు తెలిపారు.

మరోవైపు మధ్యప్రదేశ్, బీహార్, చండీగఢ్, ఢిల్లీ రాష్ట్రాల్లో హోలీని నిషేధించారు. మహారాష్ట్రలో ముంబై, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా నిషేధం ఉంది. 20 మంది కంటే ఎక్కువ గుమికూడవద్దని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. హోలీ వేడుకలకు ప్రభుత్వ అనుమతులు తప్పనిసరని... అనుమతి లేకుండా హోలీ నిర్వహిస్తే ఐపీసీ సెక్షన్ల కింద కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చింది. మరిన్ని రాష్ట్రాలు కూడా నిషేధం విధించే దిశగా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

Corona Virus
Holi
States
Ban
  • Loading...

More Telugu News