Sachin Tendulkar: త‌న‌కు క‌రోనా సోకింద‌ని ట్వీట్ చేసిన స‌చిన్ టెండూల్కర్

sachin tests corona positive

  • ఇటీవలే రోడ్‌ సేప్టీ వరల్డ్‌ టీ20 సిరీస్‌లో పాల్గొన్న స‌చిన్
  • స్వల్ప లక్షణాలతో పాజిటివ్ నిర్ధారణ అయిందని ట్వీట్
  • కుటుంబంలోని మిగిలిన వారికి క‌రోనా నెగటివ్

ఇటీవలే రోడ్‌ సేప్టీ వరల్డ్‌ టీ20 సిరీస్‌లో పాల్గొన్న టీమిండియా మాజీ క్రికెట‌ర్ సచిన్‌ టెండూల్కర్‌కు కరోనా సోకింది. ఈ విష‌యాన్ని తెలుపుతూ ఆయ‌న ట్వీట్ చేశారు. కొవిడ్ టెస్టు చేయించుకోగా త‌న‌కు స్వల్ప లక్షణాలతో పాజిటివ్ నిర్ధారణ అయిందని ఆయ‌న పేర్కొన్నారు. అయితే, త‌న‌ కుటుంబంలోని మిగిలిన వారికి క‌రోనా నెగటివ్ గా నిర్ధార‌ణ అయింద‌ని ఆయ‌న తెలిపారు.

తాను ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నాన‌ని, వైద్యుల సూచ‌న‌లు తీసుకుంటున్నాన‌ని చెప్పారు. క‌రోనా సోకిన నేప‌థ్యంలో త‌న‌కు అండగా నిలిచిన ఆరోగ్య సిబ్బంది అందరికీ థ్యాంక్స్ చెబుతున్న‌ట్లు పేర్కొన్నారు. కాగా, రోడ్‌ సేప్టీ వరల్డ్‌ టీ20 సిరీస్‌లో సచిన్‌ సారథ్యంలోని ఇండియా లెజెండ్స్‌ ఫైనల్లో ఇటీవ‌ల‌ శ్రీలంకపై గెలుపొందింది.

Sachin Tendulkar
Cricket
Corona Virus
  • Loading...

More Telugu News