journalist: సీనియ‌ర్ జర్నలిస్ట్, రచయిత అనిల్ ధార్కర్ క‌న్నుమూత‌

  Anil Dharker is no more

  • ఐదు ద‌శాబ్దాల‌కు పైగా సేవ‌లు
  • కాల‌మిస్టుగా, ఎడిట‌ర్‌గా, ర‌చ‌యిత‌గా పేరు
  • విచారం వ్య‌క్తం చేసిన‌ పలువురు జర్నలిస్టులు

గుండెజబ్బుతో బాధపడుతున్న సీనియ‌ర్ జర్నలిస్ట్, రచయిత అనిల్ ధార్కర్ (74) ఈ రోజు ఉద‌యం కన్నుమూశారు. ఐదు ద‌శాబ్దాల‌కు పైగా ఆయ‌న జ‌ర్న‌లిస్టుగా సేవ‌లు అందించారు. కాల‌మిస్టుగా, ఎడిట‌ర్‌గా, టీవీ షో వ్యాఖ్యాత‌గా, ర‌చ‌యిత‌గా, ఫిల్మ్ సెన్సార్ బోర్డు స‌ల‌హాల క‌మిటీ స‌భ్యుడిగానూ ఆయ‌న ప‌నిచేశారు. ఆయ‌న మృతి ప‌ట్ల‌ పలువురు జర్నలిస్టులతో పాటు ప్ర‌ముఖులు విచారం వ్య‌క్తం చేస్తూ ట్వీట్లు చేశారు.  పత్రికారంగంతో పాటు సాహిత్య రంగంలో ఆయ‌న చేసిన సేవ‌ల‌ను కొనియాడుతున్నారు.  



journalist
India
passed away
  • Loading...

More Telugu News