Bharath Bandh: రేపే భారత్‌ బంద్‌.. రవాణా సౌకర్యాలపై తీవ్ర ప్రభావం!

Tomorrow is Bharath Bandh

  • సాగు చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళన
  • బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల సంఘాలు
  • ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు
  • రైలు, రోడ్డు రవాణా సర్వీసులపై తీవ్ర ప్రభావం

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉంది. అందులో భాగంగా రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్‌ బంద్‌ రేపు(శుక్రవారం) జరగనుంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 12 గంటల పాటు ఈ బంద్‌ కొనసాగుతుందని సంయుక్త కిసాన్‌ మోర్చా నేతలు పేర్కొన్నారు.

రైలు, రోడ్డు రవాణా సర్వీసులను నిలిపివేయాలని రైతు నేతలు నిర్ణయించారు. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో రైలు, రోడ్డు రవాణా సర్వీసులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  అలాగే, మార్కెట్లు, షాపింగ్‌ మాల్స్‌ సైతం మూసివేయాలని రైతులు నాయకులు పిలుపునిచ్చారు. బంద్‌ను శాంతియుతంగా నిర్వహించి తమకు మద్దతుగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంబులెన్స్‌, అత్యవసర సేవలు మినహా అన్నింటినీ అడ్డుకుంటామని స్పష్టం చేశారు.

రేపటి బంద్‌కు కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ, ఆప్‌, తెదేపా, వైకాపా, సీపీఎం, సీపీఐ సహా పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. దీంతో పలు రాష్ట్రాల్లో సాధారణ జనజీవనంపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఎస్‌కేఎం ఇచ్చిన బంద్‌ పిలుపునకు పలు రైతు సంఘాలు, కార్మిక, విద్యార్థి సంఘాలు, బార్‌ అసోసియేషన్లు, రాజకీయ పార్టీలు తమ మద్దతు ప్రకటించాయని రైతు నేత దర్శన్‌ పాల్‌ తెలిపారు. 

Bharath Bandh
new farm laws
farmers protest
  • Loading...

More Telugu News