KCR: శాసనమండలి చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లుకు భార్యావియోగం... సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్

CM KCR condolences to the demise of Vijayalakshmi
  • బోడకుంటి అర్ధాంగి విజయలక్ష్మి కన్నుమూత
  • తీవ్ర విషాదంలో చీఫ్ విప్ కుటుంబం
  • ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్
  • సంతాపం తెలిపిన మంత్రులు ఇంద్రకరణ్, సత్యవతి
తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు అర్ధాంగి విజయలక్ష్మి ఇటీవల కన్నుమూశారు. విజయలక్ష్మి మృతితో బోడకుంటి వెంకటేశ్వర్లు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మండలి చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లుకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అటు, విజయలక్ష్మి మృతికి రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు కూడా సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.
KCR
Vijayalakshmi
Bodakunti Venkateswarlu
Legislative Council
Chief Whip
Telangana

More Telugu News