'లవ్ స్టోరీ' చిత్రం నుంచి 'ఏవో ఏవో కలలే' గీతాన్ని విడుదల చేసిన మహేశ్ బాబు
- శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రేమకథా చిత్రం
- నాగచైతన్య, సాయిపల్లవి జంటగా 'లవ్ స్టోరీ'
- సోషల్ మీడియాలో పాటను లాంచ్ చేసిన మహేశ్ బాబు
- పవన్ సీహెచ్ బాణీలు
- సాహిత్యం అందించిన భాస్కరభట్ల
'ఏవో ఏవో కలలే' గీతానికి భాస్కరభట్ల సాహిత్యం అందించారు. పవన్ సీహెచ్ సంగీత దర్శకుడు. సున్నితమైన ప్రేమకథా చిత్రంగా వస్తున్న 'లవ్ స్టోరీ' ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమా నుంచి ఇంతకుముందు రిలీజైన 'సారంగ దరియా' గీతం విశేషరీతిలో ప్రజాదరణ పొందింది.